Nobel Peace Prize: ట్రంప్‌ను నోబెల్‌కు నామినేట్ చేస్తా: జపాన్ ప్రధాని

ఇంటర్నెట్‌డెస్క్: నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎన్నో ఆశలు పెట్టుకొన్న సంగతి తెలిసిందే. పలు దేశాల మధ్య యుద్ధాలు ఆపానని ప్రచారం చేసుకుంటున్న ట్రంప్.. వచ్చే ఏడాది ఆ పురస్కారం కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నోబెల్ శాంతి బహుమతికి అధ్యక్షుడిని నామినేట్ చేస్తానని జపాన్ ప్రధాని సనాయె తకాయిచి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ వెల్లడించింది.
‘‘థాయ్‌లాండ్-కంబోడియాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో ట్రంప్ విజయం సాధించారు. ఇక, పశ్చిమాసియాలో కుదిర్చిన ఒప్పందం (ఇజ్రాయెల్-హమాస్) చరిత్రాత్మకమైంది’’ అని జపాన్ ప్రధాని పేర్కొన్నారు. జపాన్ (Japan) రాజధాని టోక్యోలో ఈ ఇద్దరు నేతల మధ్య భేటీ జరిగింది. ఆ సందర్భంగా నోబెల్ ప్రస్తావన వచ్చింది. ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘నాకు జపాన్ అంటే అభిమానం, గౌరవం ఉన్నాయి. ఇరుదేశాల మధ్య బంధం మరింత బలపడనుంది. ఈ దేశానికి ఎప్పుడూ అండగా ఉంటాం’’ అని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి.
ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి వెనుజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాదోను వరించిన సంగతి తెలిసిందే. ట్రంప్ (Donald Trump)నకు నోబెల్ రాకపోవడంపై వైట్‌హౌస్ ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. గాజా కాల్పుల విరమణ తర్వాత కూడా ట్రంప్ సేవలకు తగినంత గౌరవం దక్కలేదని పేర్కొంది. ఈ క్రమంలో నోబెల్ కమిటీ శాంతి కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చిందని ఆరోపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


