Pakistan Troops: గాజాకు పాక్‌ సైనికులు!

Eenadu icon
By International News Team Updated : 28 Oct 2025 15:57 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) నేతృత్వంలో శాంతి ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గాజా (Gaza)లో పాకిస్థాన్‌ (Pakistan) తన దళాలను మోహరించేందుకు సిద్ధమైంది. శాంతి ఒప్పందంలోని అంతర్జాతీయ దళాల (ISF)లో భాగంగా పలు దేశాలు తమ బలగాలను పంపనున్నాయి.  

ఇటీవల పాక్‌ ఆర్మీచీఫ్‌ జనరల్‌ ఆసిం మునీర్‌, ఇజ్రాయెల్‌కు చెందిన మొసాద్,  యూఎస్‌కు చెందిన సీఐఏ సీనియర్ అధికారుల మధ్య రహస్య సమావేశాలు జరిగాయి. ఈ క్రమంలో పాక్‌ సైనికుల మోహరింపునకు సంబంధించిన ఓ నిర్ణయం వెలువడినట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగా దాదాపు 20వేల మంది సైనికులను పాక్‌ అక్కడకు పంపనుంది. దీనికి సంబంధించి ఇస్లామాబాద్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పాక్‌ దళాలు గాజాలో అంతర్గత భద్రతను కట్టుదిట్టం చేయడం, మానవతా సాయం, పునర్నిర్మాణానికి సంబంధించిన సేవలు అందిస్తాయి. దీంతో పాటు హమాస్‌ను ఆయుధరహితంగా మార్చడంతో సహా సరిహద్దుల్లో భద్రత బాధ్యతలు చేపడుతాయి.

పాక్‌ దళాలు.. ఇజ్రాయెల్‌, గాజాలోని మిగిలిన మిలిటెంట్‌ వర్గాల మధ్య బఫర్‌ ఫోర్స్‌గా పనిచేస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. ఈ మోహరింపునకు ప్రతిగా.. ఇజ్రాయెల్‌, అమెరికాల నుంచి పాక్‌కు ఆర్థిక ప్రోత్సాహకాలకు సంబంధించిన హామీలు లభించినట్లు తెలుస్తోంది. పాక్‌ దళాల ప్రమేయం సున్నితమైనదని, కానీ వ్యూహాత్మకంగా ప్రయోజనం చేకూరేదని ఇజ్రాయెల్‌ మీడియా అభివర్ణించింది. ఐక్యరాజ్యసమితి శాంతి కార్యకలాపాలకు ఎక్కువగా దళాలను అందించే దేశాల్లో పాక్‌ ఒకటి. ఆఫ్రికా, ఆసియా అంతటా ఐరాస కార్యకలాపాలకు 2లక్షల కంటే ఎక్కువ మంది దళాలను ఇప్పటికే మోహరించింది. 

Tags :
Published : 28 Oct 2025 14:51 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు