ట్రంప్‌నకు ఇజ్రాయెల్‌ అత్యున్నత పౌర పురస్కారం

Eenadu icon
By International News Team Updated : 13 Oct 2025 10:52 IST
Ee
Font size
  • A
  • A+
  • A++
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: గాజా ఒప్పందం కుదిర్చి.. బందీల విడుదలకు కృషి చేసినందుకు గాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Trump)నకు అరుదైన గౌరవాన్ని (Israels highest civilian honor) అందించనున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఆనర్‌’ (Presidential Medal of Honor)ను అమెరికా అధ్యక్షుడికి ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఇస్సాక్‌ హెర్జోగ్‌ వెల్లడించారు. రానున్న నెలల్లో సమయం, వేదిక నిర్ణయించి అందజేయనున్నట్లు తెలిపారు. 

బందీల విడుదల, చరిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని సాధించడంలో చేసిన కృషికి గాను ఈ గౌరవాన్ని అందుకోవడానికి ట్రంప్‌ అర్హుడని ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఇస్సాక్‌ హెర్జోగ్‌ (Isaac Herzog) పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌కు ట్రంప్‌ ఇచ్చిన అచంచలమైన మద్దతు, దేశ పౌరుల భద్రత, శ్రేయస్సు కోసం ఆయన నెలకొల్పిన శాంతిని ఈవిధంగా తాము గౌరవిస్తున్నట్లు తెలిపారు. బందీల విడుదల, చరిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని సాధించడంలో చేసిన కృషికి గాను  ఈ గౌరవాన్ని అందుకోవడానికి ట్రంప్‌ అర్హుడని ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఇస్సాక్‌ హెర్జోగ్‌ (Isaac Herzog) పేర్కొన్నారు. 

ఇజ్రాయెల్‌కు ట్రంప్‌ ఇచ్చిన అచంచలమైన మద్దతు, దేశ పౌరుల భద్రత, శ్రేయస్సు కోసం ఆయన నెలకొల్పిన శాంతిని ఈవిధంగా తాము గౌరవిస్తున్నట్లు తెలిపారు. ట్రంప్‌ చేసిన సహాయాన్ని ఇజ్రాయెల్‌ ప్రజలు తరతరాలపాటు గుర్తించుకుంటారన్నారు. అమెరికా అధ్యక్షుడు అవిశ్రాంతంగా చేసిన కృషి ద్వారానే హమాస్‌ వద్ద బందీలుగా ఉన్న తమ పౌరులు నేడు తమ ప్రియమైన వారిని చేరుకోనున్నారని ఆనందం వ్యక్తంచేశారు. ఇజ్రాయెల్‌లోనే కాకుండా మధ్యప్రాచ్యంలో శాంతియుత భవిష్యత్తును నెలకొల్పడానికి ట్రంప్‌ పునాది వేశారని కొనియాడారు. 

ఇప్పటివరకు చేసిన అతిపెద్ద శాంతి ఒప్పందం అదే: ట్రంప్‌ 

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య చేసిన కాల్పుల విరమణ ఒప్పందమే తాను ఇప్పటివరకు చేసిన అతిపెద్ద ఒప్పందమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్‌ ఈరోజు ఇజ్రాయెల్‌ బందీలను విడుదల చేయనున్న నేపథ్యంలో ట్రంప్‌ ఇజ్రాయెల్‌ బయలుదేరి వెళ్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇరాన్‌పై చేసిన దాడుల వల్ల హమాస్‌ను బలహీనపరచగలిగామని..ఆ దాడుల వల్లే శాంతి ఒప్పందం చేసుకోవడానికి మార్గం సుగమం అయ్యిందన్నారు.

Published : 13 Oct 2025 10:29 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

లైవ్ టీవీ