Earthquake: భూప్రకంపనలు ఆపరేషన్‌ థియేటర్‌ను వణికించినా సర్జరీని పూర్తి చేశారు.. వీడియో వైరల్‌

Eenadu icon
By International News Team Updated : 30 Jul 2025 15:01 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మాస్కో: రష్యా తీరంలో భారీ భూకంపం (Russia Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 8.8గా నమోదైన ఈ భూకంపం రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పాన్ని అతలాకుతలం చేసింది. బలమైన ప్రకంపనలు ఆ ప్రాంతాన్ని కుదిపేశాయి. భవనాలు ఊగిపోయాయి. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

  • శక్తిమంతమైన భూప్రకంపనలు (Earthquake) సంభవించిన సమయంలో కామ్చాట్కా ప్రాంతంలోని ఓ ఆస్పత్రి దృశ్యాలను రష్యన్‌ న్యూస్‌ నెట్‌వర్క్‌ ఆర్టీ(RT) షేర్‌ చేసింది. ఆపరేషన్‌ థియేటర్‌లో సర్జరీ జరుగుతున్న సమయంలో భూకంపం సంభవించింది. ప్రకంపనల ధాటికి ఆ భవనం మొత్తం ఊగిపోయింది. అయితే.. వైద్యులు ఏ మాత్రం భయపడకుండా.. ప్రశాంతంగా ఉండి ఆ సర్జరీని పూర్తి చేయడం గమనార్హం. ఆపరేషన్‌ థియేటర్‌లోని స్ట్రెచర్‌ను ఊగకుండా సిబ్బంది గట్టిగా పట్టుకోగా.. వైద్యులు సర్జరీని కొనసాగించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. వైద్యుల నిబద్ధతను మెచ్చుకుంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆ సర్జరీ విజయవంతంగా జరిగిందని.. రోగి కోలుకుంటున్నారని రష్యన్‌ ఆరోగ్య శాఖ ప్రకటించినట్టు ఆర్టీ న్యూస్‌ ఛానల్‌ వెల్లడించింది.
  • సునామీ ఎఫెక్ట్‌.. తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలాలు..!

భూకంప కేంద్రం సమీపంలోని కామ్చాట్కా ద్వీపకల్పంలోని ఓడరేవులు పూర్తిగా దెబ్బతిన్నాయి. సునామీ అలల కారణంగా ఆ ప్రాంతంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. రష్యా (Russia)లో తూర్పు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున వచ్చిన భారీ భూకంపం కారణంగా దాంతోపాటు చుట్టుపక్కల దేశాలపై సునామీ అలలు విరుచుకుపడ్డాయి. అలలు తాకిన దీవుల్లో రష్యా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ సునామీ వల్ల ఆయా ప్రాంతాల్లో సముద్ర జలాలు ముందుకు వచ్చాయి. పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి.


Tags :
Published : 30 Jul 2025 14:28 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని