H-1B visa: హెచ్1బీ వీసా దుర్వినియోగంపై అమెరికా కార్మిక శాఖ వీడియో

ఇంటర్నెట్‌డెస్క్: హెచ్-1బీ వీసాల దుర్వినియోగంపై ట్రంప్ సర్కారు గత కొంతకాలంగా ఆగ్రహంగా ఉంది. ఈ క్రమంలో అక్కడి లేబర్ డిపార్ట్‌మెంట్ ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియో యాడ్‌ను విడుదల చేసింది. హెచ్1బీ వీసాలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, అమెరికన్ యువత స్థానంలో విదేశీ కార్మికులతో భర్తీ చేస్తున్నాయని అందులో పేర్కొంది. ఇలా వీసాలు పొందుతున్నవారిలో అత్యధికులు భారతీయులు కూడా ఉన్నారని సదరు వీడియోలో పేర్కొంది.
‘‘హెచ్-1బీ వీసా (Visa) దుర్వినియోగం కారణంగా విదేశీ కార్మికులతో ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. యువ అమెరికన్ల అమెరికా డ్రీమ్ దొంగతనానికి గురవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, లేబర్ విభాగం నాయకత్వంలో వీసాను దుర్వినియోగం చేస్తున్న కంపెనీలను జవాబుదారీ చేస్తున్నాం. అమెరికా ప్రజల కోసం అమెరికా కలను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాం. కష్టపడి పనిచేస్తే.. అమెరికా కలను సాధించుకోవచ్చని మేం తరతరాలుగా చెప్తున్నాం. కానీ మా యువత విషయంలో అలా జరగడం లేదు’’ అని యాడ్‌లో ప్రస్తావించారు. హెచ్-1బీల్లో 72 శాతం భారతీయులకే వెళ్తున్నాయని వీడియోలో భాగంగా ఓ గ్రాఫ్‌లో చూపించారు. ఈ వీసాల విషయంలో ఏవైనా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయా..? అని గుర్తించేందుకు ‘ప్రాజెక్ట్ ఫైర్‌వాల్’ పేరిట లేబర్ విభాగం ఆడిట్ నిర్వహిస్తోంది. అమెరికన్ యువత స్థానంలో తక్కువ జీతాలకు పనిచేసే విదేశీ యువతతో భర్తీ చేయకుండా చూడడమే దీని ముఖ్య ఉద్దేశం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


