United Airlines: ఆగిఉన్న విమానాన్ని ఢీకొట్టిన మరో విమానం..

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని ఓ విమానాశ్రయంలో ఆగిఉన్న విమానాన్ని మరో విమానం ఢీకొంది. అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి ఫ్లోరిడా నుంచి తిరిగి వస్తున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం న్యూయార్క్‌లోని లాగార్డియా విమానాశ్రయం (LaGuardia Airport)లో దిగుతుండగా.. టాక్సీవేలో ఆగిఉన్న మరో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం వెనుక భాగాన్ని ఢీకొంది. (Two United Airlines Planes Collide). ప్రతికూల వాతావరణం కారణంగా ఆగిఉన్న విమానం కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ ఘటనలో విమానాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. విమానం ఢీకొన్న వెంటనే అందులో నుంచి వెంటనే ప్రయాణికులను దింపేసి.. రెండు విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు తెలిపారు. ప్రమాదం సమయంలో రెండు విమానాల్లో 328 మంది ప్రయాణికులు సహా 15 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


