JD Vance: ఉషా క్రిస్టియన్ కాదు.. కానీ - మతం వివాదంపై జేడీ వాన్స్

ఇంటర్నెట్ డెస్క్: తన సతీమణి ఉషా వాన్స్ ఏదో ఒకరోజు మతం మారుతుందని ఆశిస్తున్నానని అమెరికా ఉపాధ్యక్షుడు (US Vice President) జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమమైన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై జేడీ వాన్స్ స్పందించారు. ఉషా వాన్స్ క్రిస్టియన్ కాదని, మతం మారే అవకాశం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తోన్న కామెంట్లకు ఎక్స్ వేదికగా అమెరికా ఉపాధ్యక్షుడు (JD Vance) వివరణ ఇచ్చారు.
‘‘నా మతాంతర వివాహం గురించి ప్రశ్నలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధి కావడంతో వీటి గురించి తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉండటం సహజం. వీటిపై మాట్లాడకుండా తప్పించుకోలేను. నా మత విశ్వాసాలను నేను గౌరవిస్తాను. నా సతీమణి కూడా చాలా ఏళ్ల క్రితమే ఇందుకు అంగీకరించింది.
ఆమె క్రిస్టియన్ కాదు. మతం మారే ఆలోచన కూడా లేదు. కానీ, ఇతర మతాంతర వివాహాలు, బంధాల్లో మాదిరిగానే.. ఏదో ఒక రోజు నా దృష్టితో ఆలోచిస్తుందని ఆశిస్తున్నా. ఏదేమైనా ఆమెను ప్రేమిస్తూ, ఆమెకు అండగా ఉంటూనే ఉంటా. ఆమె నా భార్య అయినందున అన్ని విషయాలపై ఆమెతో మాట్లాడతా’’ అని జేడీ వాన్స్ పేర్కొన్నారు. మత విశ్వాసాల గురించి ఇతరులతో పంచుకోవడం సహజమేనని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


