భారీ గాజు తలుపు మీదపడి.. మూడేళ్ల చిన్నారి మృతి

లుథియానా: భారీ గాజు తలుపు మీద పడటంతో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన పంజాబ్‌లోని లుథియానా ఘుమర్‌ మండి మార్కెట్‌లో జరిగింది. స్థానిక వస్త్ర దుకాణంలో.. గాజు తలుపు హ్యాండిల్‌ను పట్టుకొని ఓ చిన్నారి అటూ ఇటూ ఊగడంతో.. తలుపు మొత్తం ఊడిపోయి ఆమెపై పడిపోయింది. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని కుటుంబ సభ్యులు, షోరూమ్‌లో పని చేస్తున్న సిబ్బంది హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. అయితే, ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదు.

Updated : 28 Nov 2023 21:22 IST
Tags :

మరిన్ని