Flying car: జేమ్స్‌బాండ్‌ సినిమా తరహా ఆకాశంలో ఎగిరే కారు.. విశేషాలివే!

స్లోవేకియాకు చెందిన క్లేయిన్ విజన్స్ కంపెనీ ఈ ఎగిరే కారును రూపొందించింది. దీని విలువ 4 కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు. 520 పైగా టేకాఫ్ల్‌లను విజయవంతంగా పూర్తి చేసినట్లు కంపెనీ తెలిపింది.

Updated : 24 Apr 2024 17:09 IST

ఫ్రాన్స్‌కు చెందిన 75 ఏళ్ల జాన్ మిషెల్ జా.. ఎయిర్ కారులో ప్రయాణించిన తొలి ప్రయాణికుడిగా నిలిచారు. స్లోవేకియాకు చెందిన క్లేయిన్ విజన్స్ కంపెనీ ఈ కారును రూపొందించింది. ఇటీవల ఆ కంపెనీ జేమ్స్ బాండ్ వాహనం తరహా ఎగిరే కారును చైనాలో తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం వీరు తయారు చేసిన ఎయిర్ కార్.. ఇప్పటికే 130 విమాన గంటలు ఆకాశంలో విహరించిందని, 520 పైగా టేకాఫ్‌లను విజయవంతంగా పూర్తి చేసినట్లు కంపెనీ తెలిపింది. రహదారిపై కారుగా, ఆకాశంలో విమానంగా ఉపయోగపడే ఈ ఎగిరేకారు.. రెక్కలు, వెనకభాగం ముడుచుకునే ప్రత్యేకతను కలిగిఉంది. ప్రయాణికుల రక్షణార్థం పారాచూట్ సౌకర్యం కూడా ఉందని కంపెనీ నిర్వాహకులు వెల్లడించారు.

Tags :

మరిన్ని