అనారోగ్యకర ఆహారంతోనే 56శాతం వ్యాధులు

మనిషి ఆరోగ్యంలో ఆహారానిది అత్యంత కీలక పాత్ర. ముఖ్యంగా కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్న తరుణం ఇది. ఇలాంటి సమయంలో భారత్‌లో ఏకంగా 56శాతం వ్యాధులకు అనారోగ్యకర ఆహారమే కారణం అని ఐసీఎమ్‌ఆర్‌, జాతీయ పోషహాకార సంస్థ అధ్యయనంలో తేలింది.

Updated : 18 May 2024 17:23 IST

మనిషి ఆరోగ్యంలో ఆహారానిది అత్యంత కీలక పాత్ర. ముఖ్యంగా కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్న తరుణం ఇది. పోషహాకారం లేనిదే మనిషి ఆరోగ్యంగా ఉండలేని ఈ పరిస్థితికి మనం వచ్చేశాం. ఇలాంటి సమయంలో భారత్‌లో ఏకంగా 56శాతం వ్యాధులకు అనారోగ్యకర ఆహారమే కారణం అని ఐసీఎమ్‌ఆర్‌, జాతీయ పోషహాకార సంస్థ అధ్యయనంలో తేలింది. పోషహాకారంతో పోలిస్తే అధిక కొవ్వు, తీపి, ఉప్పుతో చేసినవి, ప్రాసెస్‌ చేసిన ఆహారం తక్కువ ధరకు అందుబాటులో ఉండడంతో ప్రజలు వీటికి మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించింది. ఆరోగ్యకర జీవనానికి తీసుకోవాల్సిన ఆహారానికి సంబంధించి పాటించాల్సిన మార్గదర్శకాలను ఐసీఎమ్‌ఆర్‌ విడుదల చేసింది.

Tags :

మరిన్ని