Crime News: ఆస్పత్రి వద్ద విషాదం.. దంపతులపై చెట్టు పడి భర్త మృతి

హైదరాబాద్ బొల్లారంలోని కంటోన్మెంట్ ఆస్పత్రి వద్ద విషాదం చోటుచేసుకుంది.

Updated : 21 May 2024 14:00 IST

ఆస్పత్రి వద్ద విషాదం.. దంపతులపై చెట్టు పడి భర్త మృతి

హైదరాబాద్ బొల్లారంలోని కంటోన్మెంట్ ఆస్పత్రి వద్ద విషాదం చోటుచేసుకుంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన దంపతులపై ప్రమాదవశాత్తు భారీ వృక్షం విరిగిపడడంతో భర్త రవీందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య సరళాదేవికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. సరళాదేవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Tags :

మరిన్ని