Viral Video: తప్పతాగి బైక్‌ను ఢీ కొట్టడమే కాకుండా.. కానిస్టేబుల్‌ వీరంగం

పెద్దపెల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండలంలో మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్ వాహనదారుణ్ని ఢీ కొట్టడమే కాకుండా.. అతనిపై దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఎన్టీపీసీ ఠాణా కానిస్టేబుల్‌ పోగుల అజయ్ అతని బంధువుతో కలిసి.. కమాన్‌పూర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద వైన్‌ షాప్‌లో అతిగా మద్యం తాగాడు. ఆపై రోడ్‌పై వెళ్తున్న సింగరేణి ఉద్యోగి శనిగరపు సమ్మయ్యను బైక్‌తో ఢీ కొట్టాడు. అదే మైకంలో ‘నేను కానిస్టేబుల్‌ను.. నా బైక్‌నే ఢీకొడతావా’ అంటూ దాడికి పాల్పడ్డాడు. అతనిపై దుర్భాషలూ ఆడాడు. అక్కడున్న ప్రజలు ఇద్దరిని శాంతింపజేయడంతో వివాదం సద్దుమణిగింది. ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులకు విచారణ చేపట్టారు. 

Updated : 12 Jun 2023 21:41 IST

Tags :

మరిన్ని