రేవంత్‌ సభలో అపశ్రుతి.. 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డ వ్యక్తి

నారాయణపేటలో నిర్వహించిన కాంగ్రెస్‌ బహిరంగ సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. మైకుల కోసం 15 నుంచి 20 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఇనుప స్టాండ్‌పైకి ఎక్కి ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. కిందకు దిగాలని అందరూ వారించినా దిగలేదు.  అతడిని దించేందుకు మరో వ్యక్తి పైకి ఎక్కే క్రమంలో.. అప్పటికే పైనున్న వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తలకు గాయం కావటంతో అతనిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన అనంతరం సభకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. సభ ముగిసిన అనంతరం కొందరు యువకుల మధ్య తోపులాట జరిగింది. కోపోద్రిక్తులైన యువకులు కుర్చీలతో కొట్టుకున్నారు. యువకులు ఎందుకు కొట్టుకున్నారో అక్కడ ఉన్న సభికులకు అర్థం కాలేదు.

Updated : 26 Nov 2023 18:20 IST

రేవంత్‌ సభలో అపశ్రుతి.. 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డ వ్యక్తి

Tags :

మరిన్ని