A Masterpiece: మరో సూపర్‌ హీరో మూవీ.. ఆకట్టుకునేలా ‘ఏ మాస్టర్‌ పీస్‌’ టీజర్‌

‘ఇట్స్‌ మై లవ్‌స్టోరీ’ ఫేమ్‌ అరవింద్‌ కృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న సూపర్‌ హీరో మూవీ ‘ఏ మాస్టర్‌ పీస్‌’. తాజాగా టీజర్‌ రిలీజైంది.

Published : 07 Jun 2024 17:49 IST

మరో సూపర్‌ హీరో మూవీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అదే ‘ఏ మాస్టర్‌ పీస్‌’. ‘ఇట్స్‌ మై లవ్‌స్టోరీ’ ఫేమ్‌ అరవింద్‌ కృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు సుకు పూర్వజ్‌ తెరకెక్కిస్తున్నారు. అషురెడ్డి, స్నేహా గుప్త హీరోయిన్లు. టీజర్‌ని శుక్రవారం విడుదల చేసింది చిత్ర బృందం. విజువల్స్‌, సంభాషణలు, హీరో ఎలివేషన్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.

Tags :

మరిన్ని