Tourism: తిరుపతి, షిర్డీకి ‘తెలంగాణ’ ఏసీ బస్సులు.. ప్యాకేజీ ఎంతంటే?

తిరుపతి, షిర్డీ వెళ్లే యాత్రికుల కోసం.. తెలంగాణ పర్యాటక శాఖ (Telangana Tourism Department) సరికొత్త ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం కొత్తగా రెండు ఏసీ స్లీపర్‌ బస్సులను కొనుగోలు చేసింది. వీటిని మంత్రి శ్రీనివాస్ గౌడ్.. రవీంద్రభారతి ప్రాంగణంలో ప్రారంభించారు. 30 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ బస్సులను ఒక్కోదానికి రూ.59 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతి (Tirupati) వెళ్లాలనుకునే వారికి పెద్దలకు రూ.4,200, చిన్నారులకు రూ.3,360.. షిర్డీ (Shirdi)కి పెద్దలకు రూ.3,700, చిన్నారులకు రూ.3,010తో రెండు రోజుల ప్యాకేజీని అందిస్తున్నట్టు తెలిపారు. ప్యాకేజీలో భాగంగా వసతి, దర్శన సౌకర్యాలు కల్పిస్తున్నట్టు మంత్రి వివరించారు.

Updated : 17 Apr 2023 17:34 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు