TS News: ఆవుల పంపిణీలోనూ అక్రమాలు.. సుమారు రూ.3 కోట్లు పక్కదారి

గొర్రెల పంపిణీ పథకంలో నిధులు పక్కదారి పట్టించిన వ్యవహారంపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆవుల పంపిణీలోనూ ఇదే తరహా మోసం వెలుగులోకి వచ్చింది. గొర్రెల పంపిణీకి సంబంధించి రూ.2.01 కోట్ల నిధులు పక్కదారిపట్టడంపై దర్యాప్తు ప్రారంభించిన అవినీతి నిరోధక శాఖ ఇప్పటికే నలుగురు అధికారులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఆవుల సరఫరా బాధితులు అనిశా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. గొర్రెల పథకంలో నిధులు మళ్లించిన ముఠా.. ఈ పథకంలోనూ సుమారు రూ.3 కోట్ల మేర దారి మళ్లించినట్టు తెలుస్తోంది.

Published : 28 Feb 2024 12:50 IST

Tags :

మరిన్ని