Chiranjeevi: ఏపీ అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలనేది నా పెద్ద కోరిక: చిరంజీవి

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, తెదేపా అధినేత చంద్రబాబు, భాజపా కలిసి కూటమిగా ఏర్పడటం మంచి పరిణామమని సినీనటుడు చిరంజీవి అన్నారు.

Updated : 21 Apr 2024 11:53 IST

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, తెదేపా అధినేత చంద్రబాబు, భాజపా కలిసి కూటమిగా ఏర్పడటాన్ని సినీనటుడు చిరంజీవి (Chiranjeevi) స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలనేది తనకున్న పెద్ద కోరిక అని తెలిపారు. అనకాపల్లి నుంచి భాజపా తరఫున లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేశ్‌, పెందుర్తి అసెంబ్లీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేశ్‌ శనివారం హైదరాబాద్‌లోని చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారిద్దరిని గెలిపించాలని కోరుతూ వీడియో విడుదల చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు