సీనియార్టీ ఉందని నర్సును సర్జన్‌ చేస్తారా?.. ప్రవీణ్‌ప్రకాశ్‌ తీరుపై హైకోర్టు అసంతృప్తి

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో బోధనేతర సిబ్బందికి ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి కల్పించే జీవో 76 విషయంలో వివరణ ఇచ్చేందుకు హాజరైన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌కు హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వ నిర్ణయంతో వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించింది. సానుభూతి, సమన్యాయం పేరుచెప్పి విద్యా సంస్థల్లో పదోన్నతులు ఇవ్వడం సరికాదని తేల్చిచెప్పింది. లైబ్రేరియన్లకు పుస్తకం కవర్‌ పేజీపై ఏముందో తెలుస్తుందికాని.. లోపల ఉన్న విషయంపై ఏమి అవగాహన ఉంటుందని ప్రశ్నించింది.

Published : 02 Apr 2024 10:45 IST
Tags :

మరిన్ని