Dastagiri: జగన్‌ నామినేషన్‌ వేసే రోజు.. నేను నామినేషన్‌ వేయకూడదా?: దస్తగిరి

వివేకా హత్య కేసులో సునీతతో తాను చీకటి ఒప్పందం చేసుకున్నానని అవినాష్ రెడ్డి నిరూపిస్తే జైలుకు వెళ్లడానికి తాను సిద్ధమేనని.. వివేకా కేసులో అప్రూవర్ దస్తగిరి సవాల్ విసిరారు.

Published : 22 Apr 2024 16:04 IST

వివేకా హత్య కేసులో సునీతతో తాను చీకటి ఒప్పందం చేసుకున్నానని అవినాష్ రెడ్డి నిరూపిస్తే జైలుకు వెళ్లడానికి తాను సిద్ధమేనని.. వివేకా కేసులో అప్రూవర్ దస్తగిరి సవాల్ విసిరారు. అవినాష్ రెడ్డి నిరూపించలేకపోతే జైలుకు వెళ్లడానికి ఆయన సిద్ధమా? అని ప్రశ్నించారు. వివేకా కేసులో హంతకుడు బయట తిరుగుతున్నాడని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటాన్ని దస్తగిరి తప్పుబడ్డారు. హత్య చేయించింది ఎవరో జగన్, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డికి తెలియదా? అని ప్రశ్నించారు. ఈ నెల 25న  గన్ నామినేషన్ వేస్తుండటంతో.. తాను నామినేషన్ వేయడం కుదరదని అధికారులు చెప్పడంపై ఆయన మండిపడ్డారు. 

Tags :

మరిన్ని