Bandi Sanjay: బోనస్‌ ఇవ్వడానికే డబ్బులు లేవంటున్న సీఎం.. రుణమాఫీ ఎలా చేస్తారు?: బండి సంజయ్

తాను మాట్లాడితే దేవుళ్ల పేరిట రాజకీయం అంటున్న కాంగ్రెస్ నాయకులు.. ఎన్నికల హామీల అమలుకు ఒట్టు పెట్టుకుంటున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. 

Published : 24 Apr 2024 18:02 IST

తాను మాట్లాడితే దేవుళ్ల పేరిట రాజకీయం అంటున్న కాంగ్రెస్ నాయకులు.. ఎన్నికల హామీల అమలుకు ఒట్టు పెట్టుకుంటున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యానికి బోనస్ ఇస్తామని ఏ ఒక్క రైతుకూ ఇవ్వలేదని విమర్శించారు. పైగా ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట కోత విధిస్తున్నారని ధ్వజమెత్తారు.

Tags :

మరిన్ని