Medaram: మేడారం జాతరలో దొంగల చేతివాటం.. రూ.35 వేలు పోగొట్టుకున్న భక్తుడు

మేడారం జాతరలో భక్తుల రద్దీ పెరగడంతో జేబు దొంగలు రెచ్చిపోతున్నారు. గద్దెలు, జన సమూహాలను ఎంచుకుని చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఏమాత్రం ఆదమరిచినా బంగారు ఆభరణాలు, డబ్బులు, చరవాణులను దొంగిలిస్తున్నారు. హెల్ప్‌డెస్క్ లు, తప్పిపోయిన శిబిరాల వద్దకు బాధితులు పరుగులు తీసినా ఫలితం లేకుండా పోతోంది. కనీసం సీసీ కెమెరాల్లో చూసి వెతికేందుకూ అధికారులు ప్రయత్నించట్లేదని బాధితులు వాపోతున్నారు.   

Published : 22 Feb 2024 13:41 IST
Tags :

మరిన్ని