100 మందితో ప్రయాణిస్తున్న పడవలో మంటలు.. సముద్రంలో దూకేసిన పర్యటకులు

దక్షిణ థాయ్‌లాండ్ తీరంలో 100 మందితో ప్రయాణిస్తున్న పడవలో మంటలు చెలరేగాయి. బుధవారం సాయంత్రం సురత్ థాని తీరం నుంచి బయలుదేరిన బోటు.. థాయ్‌లాండ్ తీరానికి వంద కి.మీ. దూరంలోని  ప్రముఖ పర్యాటక క్షేత్రం కోటావ్‌కు చేరుకునే క్రమంలో ప్రమాదానికి గురైనట్లు అధికారులు చెప్పారు. మొదట పెద్ద శబ్దం వినిపించిందని.. అనంతరం ఐదు నిమిషాల్లోనే పడవలో మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు తెలిపారు.

Published : 04 Apr 2024 15:53 IST
Tags :

మరిన్ని