Bujji and Bhairava: స్టంట్స్‌తో అదరగొట్టిన బుజ్జి అండ్‌ భైరవ.. ట్రైలర్‌ చూశారా?

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కల్కి 2898ఏడీ’ మూవీ విడుదల నేపథ్యంలో యానిమేటెడ్‌ సిరీస్‌ సిద్ధమైంది.

Updated : 30 May 2024 17:38 IST

Bujji and Bhairava: ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. జూన్‌ 27న ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇటీవల బుజ్జి పేరుతో కారును పరిచయం చేసిన చిత్ర బృందం ఇప్పుడు బుజ్జి (కారు), భైరవ(ప్రభాస్‌)కలిసి చేసే సాహసాలకు సంబంధించిన యానిమేటెడ్‌ సిరీస్‌ను తీసుకురాబోతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో మే 31వ తేదీ నుంచి తెలుగు, హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్‌ కానుంది. ఈ క్రమంలో ట్రైలర్‌ విడుదలైంది.

Tags :

మరిన్ని