Climate Change: వాతావరణంలో మునుపెన్నడూ చూడని అనూహ్య మార్పులు

కాలుష్యం పెరిగిపోతోంది. ఫలితంగా...భూమి వేడెక్కుతోంది.

Published : 24 Apr 2024 23:09 IST

కాలుష్యం పెరిగిపోతోంది. ఫలితంగా. భూమి వేడెక్కుతోంది. అన్నీ కలగలిసి. వాతావరణంలో మునుపెన్నడూ చూడని అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. దంచికొట్టే ఎండలు, కుండపోత వానలు, ఆకస్మిక వరదలు, తుపాన్లు, పిడుగులు. ఒకటేమిటి వాతావరణ మార్పుల ప్రభావంతో. లెక్కకు మిక్కిలి విపత్తులు. ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. అయితే వీటిని ముందుగానే గుర్తించి అప్రమత్తమయ్యే విషయంలో భారత్. చాలా వెనకబడిందని తేలింది. ఆసియాలోని 21 దేశాల్లో సర్వే నిర్వహించగా. ఈ విషయంలో భారత్. 14వ స్థానంలో ఉందని. ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. ఆసియాలోని అనేక చిన్న దేశాలు. ఈ విషయంలో మన కంటే ముందున్నట్లు వెల్లడించింది. మరి భారత్ కు ఎందుకు ఈ పరిస్థితి తరచూ విపత్తుల బారిన పడుతున్నా. పాఠాలు నేర్చుకోవడం లేదా ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి.

Tags :

మరిన్ని