అప్పు తెచ్చిన తగాదా.. ముషీరాబాద్‌లో హోటల్‌ ఎదుట యువకుల ఘర్షణ!

  హైదరాబాద్ ముషీరాబాద్‌లోని ఓ హోటల్ వద్ద యువకుల మధ్య ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వినియోగదారులిద్దరి మధ్య వాగ్వాదం చిలికి చిలికి గాలి వానైంది. అక్తర్‌, అక్బర్ ఇద్దరు వ్యక్తులు రామ్ నగర్‌లోని ఓ హోటల్‌కు హలీమ్ తినేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే వారిద్దరూ భాగస్వాములుగా ఉన్న వ్యాపార లావాదేవీల గురించి చర్చించుకున్నారు. అక్తర్ ఇ్వవ్వాల్సిన రూ.50 వేల గురించి అక్బర్ నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తి ఘర్షణకు దారితీసింది. అందరూ చూస్తుండగానే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

Published : 30 Mar 2024 15:11 IST
Tags :

మరిన్ని