AP News: ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై జగన్ ప్రభుత్వం చిన్నచూపు

రాష్ట్ర రైతాంగం, ప్రజల జీవన విధానం, పరిశ్రమలు మనుగడ ఇవన్నీ సాఫీగా సాగాలంటే సాగు, తాగునీరు ఎంతో కీలకం. ఇందుకు గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంతో కృషి చేశాయి. ఐదేళ్ల జగన్ రెడ్డి పాలన మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఐదేళ్లలో కొత్త ప్రాజెక్టుల ఊసెత్తని వైకాపా సర్కార్... గత ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులు పూర్తిలోనూ విఫలమైంది. ప్రధానంగా ఉత్తరాంధ్రపై వివక్ష చూపిన సీఎం జగన్ సాగు, తాగు నీరు అందించ లేక రైతుల కన్నీటికి కారణమయ్యాడు. ఈ జిల్లాలకు సాగు, తాగు నీరు అందించే  సుజల స్రవంతి, వంశధార, నాగావళి అనుసంధానం, తోటపల్లి బ్యారేజీ, తారకరామ తీర్థసాగర్  ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేసేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉత్తరాంధ్రలో ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు. పాదయాత్రలో ఎంతో ప్రేమ ఒలక బోసిన అదే  వ్యక్తి సీఎం కుర్చీ ఎక్కాక మొండిచేయి చూపించాడు. ఉత్తరాంధ్రపై ఇంత వివక్షకు కారణాలేంటి..? నిజంగా ఉత్తరాంద్రపై ప్రేమే ఉంటే ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేక పోయారు..?

Published : 12 Apr 2024 23:32 IST

Tags :

మరిన్ని