CM Revanth: పేదల ఇంట్లో వెలుగులు చూసి.. మోదీ, కేసీఆర్‌ కడుపు మండుతోంది: సీఎం రేవంత్‌

తెలంగాణలో ఐదు గ్యారంటీలు అమలు చేశామని, త్వరలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కూడా పూర్తిచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Published : 22 Apr 2024 16:45 IST

తెలంగాణలో ఐదు గ్యారంటీలు అమలు చేశామని, త్వరలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కూడా పూర్తిచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జనజాతర’ సభలో ఆయన మాట్లాడారు. ‘‘నాగోబా జాతరకు రూ.4 కోట్లు కేటాయించనున్నాం. కుప్టి ప్రాజెక్టును నిర్మించి ఆదిలాబాద్‌ను సస్యశ్యామలం చేస్తాం. తుమ్మిడిహట్టిలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కడతాం.. దానికి బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెడతాం. ఆదిలాబాద్‌లో కొత్త యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ తోడుదొంగలే. 

Tags :

మరిన్ని