దమ్ముంటే లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు ఒక్క సీటయినా గెలిపించు! కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్లలో నిర్వహించిన ‘జనజాతర’ సభలో ఆయన మాట్లాడారు. ‘‘రేవంత్‌ పేరు చెబితే.. 3 సీట్లు కూడా వచ్చేవి కావని కేటీఆర్‌ చెప్పారు. ఆయనకు చేవెళ్ల సభ నుంచి సవాల్‌ విసురుతున్నా. దమ్ముంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు ఒక్క సీటయినా గెలిపించి చూపించాలి’’ అని సవాల్‌ విసిరారు.

Published : 27 Feb 2024 20:53 IST
Tags :

మరిన్ని