Amith Shah: చొరబాటుదార్లకు సాయం చేసేందుకే సీఏఏకు కాంగ్రెస్‌ వ్యతిరేకం: అమిత్‌షా

కాంగ్రెస్‌కు కానీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కానీ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)లో జోక్యం చేసుకునే ధైర్యం లేదని భాజపా అగ్ర నాయకుడు అమిత్‌ షా (Amit shah) అన్నారు.

Updated : 23 Apr 2024 19:35 IST

కాంగ్రెస్‌కు కానీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కానీ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)లో జోక్యం చేసుకునే ధైర్యం లేదని భాజపా అగ్ర నాయకుడు అమిత్‌ షా (Amit shah) అన్నారు. పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు, బౌద్ధులకు భారత్‌లో పౌరసత్వం ఇస్తే.. మీకు వచ్చిన సమస్య ఏంటని అడుగుతున్నాను. తమ రాష్ట్రంలోకి చొరబాటుదారులు ప్రవేశించకుండా అడ్డుకోవాలని బెంగాల్ ప్రజలు కోరుకుంటే, సందేశ్‌ఖాలీ తరహా ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలంటే మోదీ మళ్లీ ప్రధానిగా రావాలి’’ అన్నారు.  

Tags :

మరిన్ని