TS News: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి సీపీఐ మద్దతు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, సీపీఐ లోక్‌సభ ఎన్నికల్లోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి.

Published : 21 Apr 2024 12:44 IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, సీపీఐ లోక్‌సభ ఎన్నికల్లోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరగా సీపీఐ అంగీకరించిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం ముఖ్దూంభవన్‌కు వెళ్లిన భట్టి.. సీపీఐ నేతలు కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డిలతో దాదాపు రెండు గంటలు చర్చించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు