CPI Narayana: నోట్ల ఉపసంహరణలో మోదీ అవినీతి కుంభకోణం బయటపడుతోంది: సీపీఐ నారాయణ

ఇంటర్నెట్‌ డెస్క్‌: రూ.2వేల నోట్లను నిషేధించకుండా దానిని మార్చుకోవడానికి అవకాశం కల్పించడంలోనే మోదీ అవినీతి కుంభకోణం బయటపడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. గతంలో నోట్ల రద్దు ప్రకటించినప్పుడు సామాన్యులు ఇబ్బందులు పడ్డారన్నారు. కార్పొరేట్‌ కంపెనీలు, ధనవంతులు వేల కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు వీలుగా ప్రధాని మోదీ నోట్ల రద్దు చేశారన్నారు. అనంతరం చెలామణీలోకి తీసుకొచ్చిన రూ.2వేల నోట్లను తీసుకొచ్చారని, వాటిని నిషేధించకుండా మార్చకునే అవకాశం ఇవ్వడంతో ధనవంతులకు మేలు జరిగేలా నారాయణ విమర్శించారు.   

Published : 20 May 2023 00:23 IST

Tags :

మరిన్ని