Vidadala Rajini: మంత్రి విడదల రజని భర్త వేధింపులు.. ఎస్పీకి ఎన్‌ఎస్‌యూఐ నేతల ఫిర్యాదు

దళిత యువకుణ్ని కిడ్నాప్ చేసి చంపేందుకు యత్నించిన వారిపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని మంత్రి విడదల రజని భర్త తమను ఒత్తిడి చేస్తున్నారని గుంటూరు ఎన్‌ఎస్‌యూఐ నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నగరంపాలెం స్టేషన్ పరిధిలోని ఐటీసీ సుభాని హోటల్ వద్ద శనివారం తరుణ్ జైన్, అతని మిత్రులతో కలిసి తనను కిడ్నాప్ చేశారని ఎస్సీ యువకుడు నరసింహారావు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు నిందితులను అరెస్టు చేయలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 01 Apr 2024 17:16 IST
Tags :

మరిన్ని