Karnataka: మైసూరులో అంబారి మోసే ఏనుగు మృతి.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

కర్ణాటకలోని మైసూరు దసరా ఉత్సవాల్లో అంబారి మోసే అర్జున అనే ఏనుగుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో హస్సన్ జిల్లా సకలేశ్‌పుర తాలుకా దమ్మనకట్టే ప్రాంతంలో నిర్వహించారు. యసలూరు సమీపంలో సోమవారం ఏనుగులకు రేడియో కాలర్‌ను అమర్చే ఆపరేషన్‌లో అర్జున కూడా పాల్గొంది. అందులో భాగంగా ఓ అడవి ఏనుగుతో పోరాడుతూ అర్జున మృతి చెందింది.

Published : 06 Dec 2023 13:34 IST
Tags :

మరిన్ని