AP News: కేసుల వివరాలివ్వడానికి జాప్యం ఎందుకు?: హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా వివిధ ఠాణాల్లో తమపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలంటూ ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులు చేసిన విజ్ఞప్తి విషయంలో పోలీసులు స్పందించకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నెల రోజుల కిందట పిటిషనర్లు డీజీపీకి విజ్ఞప్తి చేశారని గుర్తుచేసింది. ఇవ్వాలనుకుంటే ఒక్కరోజులో అందించవచ్చని వ్యాఖ్యానించింది. ఇంతకాలం ఏం చేస్తున్నారని నిలదీసింది. పోలీసుల వద్ద సమాచారం ఉంటుందని, కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రెండుమూడు గంటల్లోనే వాటిని అందించవచ్చని తెలిపింది.

Published : 13 Apr 2024 10:06 IST

Tags :

మరిన్ని