AP News: అంధ, దివ్యాంగుల పాఠశాలను ఆఘమేఘాలపై కూల్చివేసిన అధికారులు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 20 ఏళ్లకుపైగా ఒకేచోట నిర్వహిస్తున్న జియాన్‌ అంధ, దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థుల తరలింపు శుక్రవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం 7 గంటలకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఆవరణలోకి వెళ్లి గేట్లు మూసేసి ఆఘమేఘాలపై విద్యార్థులు, సామగ్రిని వాహనాల్లో తరలించారు. షెడ్లు, నిర్మాణాలను నేలమట్టం చేశారు. వందమందికిపైగా బాలలు ఈ పాఠశాలలో చదువుతున్నారు. వసతిగృహంలో 45 మంది వరకు ఉంటున్నారు. బడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో పెద్దఎత్తున వచ్చిన పోలీసులను చూసి బాలలు భయపడ్డారు. అల్పాహారం చేయనీయకుండా కొట్టి బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించారని కొందరు విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు.

Published : 30 Dec 2023 10:04 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు