Snake in Car: స్వర్ణగిరి దర్శనానికి వచ్చిన భక్తుల కారులో దూరిన పాము

యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తుల కారులో పాము దూరింది.

Published : 07 Jun 2024 12:26 IST

యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తుల కారులో పాము దూరింది. భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో కారులో పాము ఉన్న విషయాన్ని స్థానికులు గమనించి వారికి తెలియజేశారు. అనంతరం పామును పట్టే వాళ్ళు కారులో దూరిన పామును బయటకు తీశారు. భక్తులు అదే కారులో స్వగ్రామానికి వెళ్ళిపోయారు. దేవస్థానం యాజమాన్యం భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించటం లేదని, డబ్బులు మాత్రం దండుకుంటున్నారు అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని