AP News: తాగునీటి సమస్యతో అల్లాడుతున్న పాడేరు ప్రజలు

అల్లూరి జిల్లా పాడేరులో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదేళ్లలో వంద శాతం హామీలు అమలు చేశామని వైకాపా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్రకటించుకున్నారు. దీనిపై ఓటర్లు మండిపడుతున్నారు. పంచాయతీల్లో కుళాయిలు ఉన్నా నీరు రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఓట్ల కోసం వస్తే నీళ్లు ఇవ్వనందుకు నేతలను గట్టిగా నిలదీస్తామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Published : 30 Mar 2024 14:25 IST
Tags :

మరిన్ని