సీఎం జగన్‌పై రాయి దాడి.. నేనే చేసినట్టు అంగీకరించాలని పోలీసులు ఒత్తిడి చేశారు: దుర్గారావు

సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో.. పోలీసుల అదుపులో ఉండి బయటకు వచ్చిన దుర్గారావు.. కీలక విషయాలు బయటపెట్టారు. తానే గులకరాయితో దాడి చేసినట్లు అంగీకరించాలని, తెలుగుదేశం నాయకులే ఇదంతా చేయించినట్లు చెప్పాలని పోలీసులు తనపై ఒత్తిడి చేసినట్లు దుర్గారావు తెలిపారు.

Published : 21 Apr 2024 16:05 IST

సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. కేసుకు సంబంధించి పోలీసుల అదుపులో ఉండి బయటకు వచ్చిన దుర్గారావు.. కొన్ని విషయాలు బయటపెట్టారు. తానే గులకరాయితో దాడి చేసినట్లు అంగీకరించాలని, తెలుగుదేశం నాయకులే ఇదంతా చేయించినట్లు చెప్పాలని పోలీసులు తనపై ఒత్తిడి చేసినట్లు దుర్గారావు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చిన సతీష్‌ను కూడా బలవంతంగా పోలీసులు బెదిరించి ఒప్పించారని.. అతని తండ్రి దుర్గారావు అన్నారు. గులకరాయి కేసులో అమయాకులను ఇరికించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని నిందితుడి తరఫు న్యాయవాది సలీం తెలిపారు.

Tags :

మరిన్ని