భూకంపంతో వణికిన తైవాన్‌.. ఒళ్లు గగుర్పాటుకు గురయ్యేలా దృశ్యాలు

    తైవాన్‌లో మంగళవారం 6.1 తీవ్రతతో సంభవించిన భూకంప దృశ్యాలు ఒళ్లు గగుర్పాటుకు గురయ్యేలా చేస్తున్నాయి. మొత్తం 80 ప్రకంపనలు రావడంతో తైవాన్  వాసులు భయంతో వణికిపోయారు. రాజధాని తైపీతో సహా, పశ్చిమ తైవాన్‌లోని పలు ప్రాంతాల్లో భూకంప ప్రభావం ఉన్నట్టు అధికారులు తెలిపారు.

Published : 24 Apr 2024 16:10 IST

తైవాన్‌లో మంగళవారం 6.1 తీవ్రతతో సంభవించిన భూకంప దృశ్యాలు. ఒళ్లు గగుర్పాటుకు గురయ్యేలా చేస్తున్నాయి. మొత్తం 80 ప్రకంపనలు రావడంతో తైవాన్  వాసులు భయంతో వణికిపోయారు. హువాలియన్‌లోని పలు భవనాలు కుప్పకూలాయి. రాజధాని తైపీతో సహా, పశ్చిమ తైవాన్‌లోని పలు ప్రాంతాల్లో భూకంప ప్రభావం ఉన్నట్టు అధికారులు తెలిపారు. సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. భవనాలు ఊగిపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏప్రిల్ 3న సంభవించిన భూకంపంలో దెబ్బతిన్న భవనాలను అధికారులు ఖాళీ చేయించారు. ఆ భవనాలు ఈ భూకంపంతో కుప్పకూలాయి. లేకపోతే ప్రాణ నష్టం సంభవించేదని వివరించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు