AP News: జగన్‌ భక్త ఉన్నతాధికారులపై ఈసీ కొరడా

వాళ్లంతా అఖిలభారత సర్వీసు అధికారులమనే ఇంగితం మరిచారు. అధికార వైకాపాకు బంటుల్లా మారారు. అయిదేళ్లుగా అధికార పార్టీ అరాచకాలకు కొమ్ముకాస్తూ పేట్రేగిన ఈ అధికార గణం.. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటికీ స్వామిభక్తిని వీడలేదు. అధికార పార్టీ సేవలను ఆపలేదు. చివరికి వారి తప్పులు నిగ్గు తేలాయి. కొంత ఆలస్యంగానైనా సరే కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు వారిపై వేటు వేసింది. గుంటూరు ఐజీ జి.పాలరాజు, కృష్ణా, అనంతపురం, తిరుపతి జిల్లాల కలెక్టర్లు పి.రాజబాబు, ఎం.గౌతమి, డా.లక్ష్మీశ, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీలు పరమేశ్వరరెడ్డి, వై.రవిశంకరరెడ్డి, పల్లె జాషువా, కేకేఎన్‌ అన్బురాజన్‌, కె.తిరుమలేశ్వరరెడ్డిలను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. 

Published : 03 Apr 2024 10:30 IST

Tags :

మరిన్ని