Electoral Bonds: ఎన్నికల బాండ్ల డేటాను బహిర్గతం చేసిన ఈసీ

ఎన్నికల బాండ్ల డేటాను ఎన్నికల సంఘం గురువారం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ సమర్పించిన వివరాలను ఈసీ తన వెబ్‌సైట్‌లో పెట్టింది. శుక్రవారంలోగా డేటాను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించగా గురువారమే ఈసీ వెల్లడించింది. ఈ డేటాను ఈసీ రెండు భాగాలుగా పేర్కొంది. మొత్తం 337 పేజీల డేటాను వెబ్‌సైట్‌లో ఉంచింది. రూ.11,671 కోట్ల విలువైన బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేసినట్లు ఈ డేటా ద్వారా వెల్లడైంది. ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి విరాళాలు ఇచ్చిందన్న వివరాలను ఇందులో పొందుపరచలేదు. దానికి 3 నెలల సమయం పడుతుందని ఎస్‌బీఐ వెల్లడించింది.

Published : 15 Mar 2024 12:58 IST

Tags :

మరిన్ని