AP News: పురందేశ్వరి ఫిర్యాదుపై నివేదిక కోరిన ఈసీ

ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, విజిలెన్స్‌ విభాగాధిపతి కొల్లి రఘురామ్‌రెడ్డితో పాటు పలువురు అధికారులు వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న అంశాలన్నింటిపై తక్షణమే నివేదిక పంపించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాను ఆదేశించింది. నిఘా విభాగాధిపతి పీఎస్సార్ ఆంజనేయులు, ఏపీఎస్ బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డిపైనా ఫిర్యాదు చేసిన పురందేశ్వరి.. ఎన్నికల వేళ అధికార దుర్వినియోగాన్ని అరికట్టాలని ఈసీని కోరారు.

Published : 10 Apr 2024 11:55 IST

Tags :

మరిన్ని