Chittoor: పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కడతట్లపల్లెలోని పంట పొలాలపై ఏనుగుల (Elephant) గుంపు దాడి చేసింది. కోత దశలో ఉన్న మూడు ఎకరాల అరటి తోటను ఏనుగులు నేలమట్టం చేసి, నిరాశ మిగిల్చాయని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వరలక్ష్మి అనే మహిళా రైతు.. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అరటి పంటను సాగు చేశారు. రెండు, మూడు రోజుల్లో పంటను కోయాల్సి ఉండగా.. ఈలోపే ఏనుగుల గుంపు తోటను ధ్వంసం చేసిందని ఆమె వాపోయారు. రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధితురాలు కోరారు.

Updated : 29 Nov 2023 13:36 IST

Tags :

మరిన్ని