Adinarayana Reddy: జగన్‌ అధికార వ్యామోహానికి హద్దు లేదు: ఆదినారాయణ రెడ్డి

కడప ఎంపీగా తెదేపా అభ్యర్థి భూపేశ్‌ రెడ్డి, జమ్మలమడుగు అసెంబ్లీ ఎన్డీఏ కూటమి భాజపా అభ్యర్థిగా తాను ఎన్నికల్లో గెలవబోతున్నామని ఆదినారాయణ రెడ్డి తెలిపారు.

Published : 24 Apr 2024 16:00 IST

కడప ఎంపీగా తెదేపా అభ్యర్థి భూపేశ్‌ రెడ్డి, జమ్మలమడుగు అసెంబ్లీ ఎన్డీఏ కూటమి భాజపా అభ్యర్థిగా తాను ఎన్నికల్లో గెలవబోతున్నామని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి ఆదినారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బందిపోటు పాలనకు, కూటమి అభ్యర్థుల మధ్య పోటీ జరుగుతోందని చెప్పారు. వైకాపా పాలనలో గంజాయి, ఎర్రచందనం అమ్మకాలు పెరిగిపోయాయని విమర్శించారు.

Tags :

మరిన్ని