Budget 2023: 25 ఏళ్ల ప్రగతి ప్రణాళిక.. ఏడు సూత్రాలు, మూడు లక్ష్యాలు

ఎన్నికల పద్దు పట్టాలెక్కింది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం.. సంక్షేమానికి అగ్రతాంబూళం ఇచ్చింది. బడ్జెట్ ద్వారా వేతన జీవులకు ఊరట ప్రకటించిన ఆర్థిక మంత్రి.. గృహ నిర్మాణానికి 66 శాతం మేర కేటాయింపులు పెంచారు. వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.20 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. మొత్తం రూ.45 లక్షల 3వేల 97 కోట్లతో బడ్జెట్  కేటాయింపులు జరిపిన ఆర్థికమంత్రి... మూలధన వ్యయానికి రికార్డు స్థాయిలో 10 లక్షల కోట్లు కేటాయించారు. అయితే, అప్పుల ద్వారా 17 లక్షల 86 వేల కోట్లు సేకరించాలని నిర్దేశించారు. ఇదే సమయంలో వచ్చే 25 ఏళ్లకు ప్రగతి ప్రణాళికలు ఆవిష్కరించిన నిర్మలమ్మ... ఇందుకు సప్తర్షులు అంటూ ఏడు సూత్రాలు, మూడు లక్ష్యాలను ప్రకటించారు.

Published : 01 Feb 2023 16:58 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు