Iraq: 100 మందిని బలిగొన్న ఇరాక్‌ అగ్నిప్రమాదం.. వీడియో వైరల్‌

మొసూల్‌: గత వారం ఇరాక్‌ (Iraq)లో ఓ పెళ్లి వేడుకలో జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇరాక్‌లోని నినెవేహ్‌ ప్రావిన్స్‌లోని హమ్‌దానియా ప్రాంతంలో ఓ ఫంక్షన్ హాల్‌లో వధూవరులు నృత్యం చేస్తుండగా.. వారికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో అతిథులు ఆశీనులై ఉంటారు. ఇంతలో ఫంక్షన్ హాల్‌ పైభాగంలో మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో పైకప్పు మొత్తం అగ్నికి ఆహుతి కావడంతో అక్కడున్న వారు తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ఘటనలో మొత్తం 114 మంది ప్రాణాలు కోల్పోగా, 150 మందికి పైగా గాయపడ్డారు. పెళ్లి వేడుకలో పేల్చిన బాణసంచా కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.

Updated : 04 Oct 2023 16:21 IST

Tags :

మరిన్ని