Hyderabad: అగ్నిప్రమాదాల నివారణపై మాక్‌ డ్రిల్‌

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని బహుళ అంతస్థుల భవనంలో అగ్నిమాపక శాఖ అధికారులు మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు.

Published : 21 Apr 2024 15:01 IST

అగ్ని ప్రమాదాలు జరిగిన తర్వాత తీసుకునే చర్యల కంటే అవి జరగకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడం మేలంటున్నారు అగ్నిమాపక శాఖ అధికారులు. ఇందులో భాగంగానే అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా ఆ శాఖ సిబ్బంది, అధికారులు.. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని బహుళ అంతస్థుల భవనంలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఆయా భవనాల్లో ఉండే వారుఎలా స్పందించాలి? తక్షణం చేయాల్సిన పనులపై అవగాహన కల్పించారు. 

Tags :

మరిన్ని