Warangal: ఎండతీవ్రతకు నిలిపి ఉంచిన కారులో చెలరేగిన మంటలు

వరంగల్ జిల్లా నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఎండ తాకిడికి నిలిపి ఉంచిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Published : 19 Apr 2024 20:25 IST

వరంగల్ జిల్లా నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఎండ తాకిడికి నిలిపి ఉంచిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆత్మకూరు మండలం గూడప్పాడుకి చెందిన దిలీప్ అనే వ్యక్తి తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో కారును పార్కింగ్ చేసి లోపలికి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత ఎండ తీవ్రతకు అకస్మాత్తుగా కారులోంచి మంటలు చెలరేగాయి. దీంతో అక్కడే ఉన్న స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేశారు.

Tags :

మరిన్ని