ఘోరం.. ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో ఘోరం జరిగింది. ఆలంబాగ్‌లోని పాత రైల్వే కాలనీలో ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ తెల్లవారుజామున ఇల్లు కూలిపోగా శిథిలాల కింద చిక్కుకున్న సతీశ్ చంద్ర కుటుంబసభ్యులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే.. అప్పటికే వారంతా చనిపోయినట్లుగా వైద్యులు ధ్రువీకరించారని వెల్లడించారు.

Published : 16 Sep 2023 15:33 IST

Tags :

మరిన్ని