డిసెంబర్‌ 9 నుంచే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం: వీసీ సజ్జనార్

తెలంగాణలో బాలికలు, మహిళలు, ట్రాన్స్‌ జెండర్లు ఈ నెల 9 మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో (TSRTC) ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద కల్పిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జీరో టికెట్‌ తీసుకొని రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. 

Updated : 08 Dec 2023 19:39 IST
Tags :

మరిన్ని